త్రోబాల్ చాంపియన్ అక్షిత తెలంగాణకే గర్వకారణం
జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం చాకలిశేరిపల్లికి చెందిన అక్షిత తెలంగాణ రాష్ర్టానికే గర్వకారణమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఈ నెల 7న నిర్వహించిన జాతీయ స్థాయి త్రోబాల్ ఫైనల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొన్న అక్షిత అద్భుత ప్రతిభ కనబర్చి స్వర్ణ పతకాన్ని సాధించింది.
- మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలి
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్ష
చందంపేట (దేవరకొండ), నవంబర్ 10: జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం చాకలిశేరిపల్లికి చెందిన అక్షిత తెలంగాణ రాష్ర్టానికే గర్వకారణమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఈ నెల 7న నిర్వహించిన జాతీయ స్థాయి త్రోబాల్ ఫైనల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొన్న అక్షిత అద్భుత ప్రతిభ కనబర్చి స్వర్ణ పతకాన్ని సాధించింది.
హైదరాబాద్‌కు చేరుకున్న ఆమె మంగళవారం దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో సత్తాచాటిన అక్షిత మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ నెల 19 నుంచి 23వరకు శ్రీలంకలో జరుగనున్న ఏషియన్ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో అక్షిత భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు కంకణాల వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచ్ మాచర్ల శ్రీశైలం తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

