గ్రీన్‌ఫీల్డ్.. అక్రమాలకు రోడ్
కేవలం ఐదు పని దినాల్లోనే రూ.3,296 కోట్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు సంబంధించిన 13 బిడ్ల పరిశీలన, అర్హతల నిర్ధారణ, కేటాయింపుల ప్రక్రియ ఎలా పూర్తిచేసిండ్రు? ప్రజల సొమ్ముతో చేపట్టే ప్రతి పనికీ ప్రభుత్వం పూర్తి లెకలు చెప్పాల్సిందే. -కేటీఆర్
- 3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం
- నచ్చినవారికే కాంట్రాక్టులు ఇచ్చుకున్నరు
- తకువకు బిడ్లు వేసినోళ్లను పకన పెట్టిండ్రు
- రూ.వందల కోట్ల ప్రజాధనానికి నష్టం
- టెండర్లు రద్దు చేసి విచారణ జరుపాలి
- బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- డిమాండ్.. ప్రభుత్వానికి బహిరంగ లేఖ
కేవలం ఐదు పని దినాల్లోనే రూ.3,296 కోట్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు సంబంధించిన 13 బిడ్ల పరిశీలన, అర్హతల నిర్ధారణ, కేటాయింపుల ప్రక్రియ ఎలా పూర్తిచేసిండ్రు? ప్రజల సొమ్ముతో చేపట్టే ప్రతి పనికీ ప్రభుత్వం పూర్తి లెకలు చెప్పాల్సిందే.
-కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : రూ.3,296 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన రేడియల్ రోడ్-2 టెండర్ల వ్యవహారంలో భారీ స్కామ్ ఉన్నదని, దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బుద్వేల్ నుంచి కొడంగల్ సమీపంలోని జాతీయ రహదారి వరకు చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే టెండర్లలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిం చారు. పనులను ప్యాకేజీలుగా విభజించి, ముందుగా నిర్ణయించుకున్న సంస్థలకే కట్టబెట్టారనే అనుమానాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. తకువ ధరకు బిడ్లు వేసిన సంస్థలను పకనపెట్టి, ఎకువ ధరలకు కోట్ చేసిన సంస్థలకు పనులు కేటాయించడంపై సమగ్ర విచారణ జరుపాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ శనివారం బహిరంగ లేఖ రాశారు. బుద్వేల్ వద్ద ఔటర్ రింగ్‌రోడ్ నుంచి కొడంగల్ సమీపంలోని ఎన్‌హెచ్-167ఎన్ వరకు 81.15 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారని తెలిపారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 30తో బిడ్ల దాఖలుకు గడువు ముగియగా, అక్టోబర్ 8 నాటికే సాంకేతిక మూల్యాంకనం, బిడ్డర్ల అర్హతల పరిశీలన, ఆర్థిక బిడ్ల పరిశీలన, కేటాయింపుల ప్రక్రియ పూర్తయినట్టు సంబంధిత పత్రాల్లో పేరొన్నారని వెల్లడించారు. సెలవులు మినహాయిస్తే కేవలం ఐదు పని దినాల్లోనే రూ.3,296 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించిన 13 బిడ్ల పరిశీలన, అర్హతల నిర్ధారణ, కేటాయింపుల ప్రక్రియ ఎలా పూర్తిచేశారని ప్రశ్నించారు. ప్రతి సంస్థ సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారా? నిర్ణయాలకు అవసరమైన ఆధారాలను నమోదు చేశారా? అనేది ప్రభుత్వం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
అంచనా కంటే ఎక్కువ ధరకు కేటాయింపు
ప్యాకేజీ-1ను ఎన్సీసీ లిమిటెడ్‌కు రూ.1,286.03 కోట్లకు కేటాయించారని, ఇది అంచనా వ్యయం కంటే 3.95 శాతం అధికమని సంబంధిత పత్రాల్లోనే పేరొన్నారని కేటీఆర్ గుర్తుచేశారు. ప్యాకేజీ-2 బీవీఎస్ఆర్కు, ప్యాకేజీ-3 జీకేసీకి దకినట్టు తెలిపారని వెల్లడించారు. అయితే మిగతా ప్యాకేజీల పూర్తి ఆర్థిక వివరాలు ఎందుకు బహిర్గతం చేయలేదని ఆయన ప్రశ్నించారు.
ఒకే సంస్థకు ఒక ప్యాకేజీలో అర్హత.. మరోచోట అనర్హత ఎలా?
మూడు ప్యాకేజీల్లో బిడ్డర్ల అర్హతల నిర్ధారణకు ఒకే విధమైన ప్రమాణాలు అనుసరించారా? అని కేటీఆర్ నిలదీశారు. సంబంధిత పత్రాల ప్రకారం, ప్యాకేజీ-1లో జీకేసీని అనర్హంగా ప్రకటించినప్పటికీ, ప్యాకేజీ-3లో అర్హత కల్పించారని తెలిపారు. బీవీఎస్ఆర్కు ప్యాకేజీ-1, ప్యాకేజీ-2ల్లో అర్హత కల్పించి, ప్యాకేజీ-3లో తిరసరించారని పేరొన్నారు. ఒకే సంస్థకు వేర్వేరు ప్యాకేజీల్లో భిన్నమైన నిర్ణయాలు తీసుకో వడానికి కారణాలేమిటో ప్రభుత్వం వివరించాలని కోరారు. ప్యాకేజీ-3లో రూ.1,034 కోట్ల విలువైన పనులకు ఇద్దరు బిడ్డర్లు మాత్రమే అర్హత సాధించినట్టు పేర్కొన్నారని గుర్తుచేశారు. అతి తకువ ధరకు బిడ్లు వేసినట్టు చెప్తున్న సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌ను మూడు ప్యాకేజీల్లోనూ అనర్హులుగా ప్రకటించడంపై ఆ సంస్థ అభ్యంతరం వ్యక్తంచేసిందని పేర్కొన్నారు. దీని వల్ల మూడు ప్యాకేజీల్లో కలిపి రాష్ట్రానికి సుమారు రూ.600 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆ సంస్థ తరఫున కోర్టులో సమర్పించిన వాదనల్లో పేర్కొన్నదని తెలిపారు.
ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలి
హెచ్ఎండీఏ, హెచ్‌జీసీఎల్ చేపడుతున్న భారీ టెండర్లలో తమను దూరంగా ఉంచుతున్నారని, బిడ్డర్లు తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే సాంకేతిక కారణాలతో అనర్హత వేటు వేస్తున్నారని కొందరు తెలంగాణ కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారని కేటీఆర్ ఆ లేఖలో ప్రస్తావించారు. సంస్థలను అనర్హులుగా ప్రకటించడానికి కారణాలు, పరిశీలించిన అర్హత పత్రాలు, అధికారుల నిర్ణయాలకు సంబంధించిన రికార్డులను బహిర్గతం చేయాలని అన్నారు. రేడియల్ రోడ్-1 టెండర్లపైనా పారదర్శకతకు సంబంధించి ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.591 కోట్లుగా పేరొంటూ, అంచనా వ్యయం కంటే సుమారు 15శాతం అధిక ధరకు కేటాయింపు జరిగిందని సంబంధిత పత్రాల్లో ప్రస్తావించినట్టు తెలిపారు. రెండు రేడియల్ రోడ్లకు సంబంధించిన అంచనా వ్యయాలు, బిడ్ల ధరలు, సంస్థల అర్హతలు, తుది కేటాయింపుల వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని కోరారు.
ప్రతి రూపాయికీ ప్రభుత్వం లెక చెప్పాలి
ప్రజాధనంతో చేపట్టే భారీ ప్రాజెక్టుల్లో పారదర్శకత ప్రభుత్వ బాధ్యత అని కేటీఆర్ స్పష్టం చేశారు. రేడియల్ రోడ్-2 టెండర్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు నిరాధారమైతే, ప్రభుత్వం సంబంధిత రికార్డులతో ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు. ప్రజల సొమ్ముతో చేపట్టే ప్రతి పనికి పూర్తి లెకలు చెప్పాలని, టెండర్ల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించాలని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ డిమాండ్లు ఇవి..
1. రేడియల్ రోడ్-2 టెండర్లు రద్దు చేసి, ఆరోపణలపై విచారణ జరుపాలి.
2. మూడు ప్యాకేజీల అంచనా వ్యయాలు, తుది కేటాయింపు విలువలు, బిడ్డర్ల ఆర్థిక బిడ్ వివరాలను విడుదల చేయాలి.
3. బిడ్ ఓపెనింగ్ స్టేట్మెంట్లు, కంపారేటివ్ స్టేట్మెంట్లు, మూల్యాంకన కమిటీసమావేశాల మినిట్స్, సాంకేతిక మూల్యాంకన నివేదికలు బహిర్గతం చేయాలి.
4. రూ.600 కోట్ల నష్టం జరిగిందన్న ఆరోపణపై విచారణ జరిపి వాస్తవాలు చెప్పాలి.
5. మూడేండ్లలో హెచ్ఎండీఏ, హెచ్‌జీసీఎల్ చేపట్టిన రూ.100 కోట్లకు పైబడిన కాంట్రాక్టులపై కాగ్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.
6. రెండు రేడియల్ రోడ్ల టెండర్లకు సంబంధించి బిడ్డర్లు, అనర్హతలు, ధరలు, తుది కేటాయింపులు, కాంట్రాక్టులు పొందిన సంస్థల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి.
7. సాంకేతిక అర్హతల నిర్ధారణ, బిడ్డర్లకు వివరణ ఇచ్చే అవకాశం, ఆర్థిక బిడ్ల పరిశీలన వంటి అంశాల్లో పారదర్శకతకు స్పష్టమైన నిబంధనలు రూపొందించాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

