బనకచర్ల వాస్తవ స్టేటస్ చెప్పండి
పోలవరం బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత వాస్తవ స్టేటస్ ఏమిటనేది వారంలోగా చెప్పాలని ఏపీ సర్కారును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ సెక్రటరీకి బోర్డు చైర్మన్ బుధవారం లేఖ రాశారు.
- ఏపీ సర్కారుకు కేఆర్ఎంబీ లేఖ
హైదరాబాద్, అక్టోబర్15 (నమస్తే తెలంగాణ) : పోలవరం బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత వాస్తవ స్టేటస్ ఏమిటనేది వారంలోగా చెప్పాలని ఏపీ సర్కారును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ సెక్రటరీకి బోర్డు చైర్మన్ బుధవారం లేఖ రాశారు. ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా గోదావరి నుంచి 200 టీఎంసీల వరద జలాలను బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్‌కు తరలించేందుకు రూ.81వేల కోట్ల అంచనా వ్యయంతో ఏపీ సర్కారు పీబీ లింక్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే.
ఆ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా బేఖాతరు చేస్తూ ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) తయారీ కోసం రూ.9.2 కోట్ల అంచనా వ్యయంతో కన్సల్టెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానించింది. 22వ తేదీ ఉదయం 11 గంటల్లోగా టెండర్ డాక్యుమెంట్లు సమర్పించాలని కోరింది. ఏపీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఈఎన్సీ అమ్జద్హుస్సేన్.. పీపీఏ, సీడబ్ల్యూసీతోపాటు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. టెండర్లపై ముందుకు వెళ్లకుండా ఏపీని అడ్డుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ తాజాగా స్పందించింది. తెలంగాణ ఫిర్యాదును ఉటంకిస్తూ ఏపీ సర్కారుకు లేఖ రాసింది. పీబీ లింక్ ప్రాజెక్టు వాస్తవ స్టేటస్‌ను వారం రోజుల్లోగా తెలపాలని లేఖలో కోరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

