మల్యాల, అక్టోబర్ 15: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయ నిత్యాన్నదాన సత్రం జూనియర్ అసిస్టెంట్ కూరగాయల రాములును మంగళవారం సస్పెండ్ చేసిన ట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణారావు తెలిపారు. నిత్యాన్నదాన సత్రానికి సంబంధించిన 50 కేజీల బియ్యం, సరుకులను పక్కదారి పట్టించాడన్న ఆరోపణలపై విచారణ చేశామని చెప్పారు. సీసీ కెమెరాలు పరిశీలించడంతోపాటు బియ్యాన్ని తరలించిన ఓ గ్యాస్ ఏజెన్సీకి చెందిన డెలివరీ బాయ్ సురేశ్ స్టేట్మెంట్ను తీసుకున్నామ ని, పూర్తి ఆధారాలు దొరకడంతో రాములును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు.