సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలోని పాటిగడ్డ మీద మట్టితో తయారు చేసిన పూర్వపు నేత పనిముట్టు ‘స్పూల్న్’ను నూతన తెలంగాణ చరిత్ర బృందం అన్వేషకుడు కొలిపాక శ్రీనివాస్ గురువారం గుర్తించారు.
రెండు వేల ఏండ్ల కిందట ఈ ‘స్పూల్న్’ నేతపనిలో వాడిన అరుదైన పరికరమని ఆయన తెలిపారు. గిరక మాదిరిగా ఉండే ఈ పరికరాన్ని దారం వడకడం, కండెలు చుట్టడానికి ఉపయోగించేవారని చెప్పారు.
– చేర్యాల