BJP | సెల్ఫ్ అవుటే.. మా గేమ్‌ప్లాన్!
‘తమ్మీ... కమలం పువ్వు రెక్కలు రాలినట్టు, రాలిపోతున్న వాళ్లంతా వెన్నుపోటు... అని నన్ను తిడుతుంటే నీకూ అలానే అనిపిస్తుందేమో. అది సహజమే. ఈ కిషన్ రెడ్డి పెద్ద గేమ్‌ప్లాన్‌తో ఉన్నాడు. అది ఎవరికీ తెలియదు...’
BJP | ‘మీ స్ట్రాటజీ ఏమిటో అర్థం కావడం లేదు. అసలే మీకు వెంకయ్య శిష్యుడు అనే పేరు ఉంది. ఆయన్ని రాజకీయాలకు దూరం పెట్టారని, మీరు పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారేమో అని అనుమానంగా ఉంది సార్ …’
‘తమ్మీ… కమలం పువ్వు రెక్కలు రాలినట్టు, రాలిపోతున్న వాళ్లంతా వెన్నుపోటు… అని నన్ను తిడుతుంటే నీకూ అలానే అనిపిస్తుందేమో. అది సహజమే. ఈ కిషన్ రెడ్డి పెద్ద గేమ్‌ప్లాన్‌తో ఉన్నాడు. అది ఎవరికీ తెలియదు…’
‘ఏమో సార్… అసలే మీకు మార్కెట్లో కుర్ కురే రెడ్డి అని పేరు. కరోనాలో దేశమంతా అల్లకల్లోలం అయితే మీరు కేంద్రమంత్రిగా కుర్ కురేలు పంచుతూ ఉన్నారని అంతా నవ్వుకుంటారు. మనం అధికారంలోకి వచ్చేస్తున్నామని నమ్మి హేమా హేమీలు ఎంతో మంది పార్టీలో చేరి, తీరా ఎన్నికలు ప్రకటించాక చెయ్యి ఇచ్చారు. మీడియా ప్రచారం తప్ప తెలంగాణలో కమలం ఎప్పుడో వాడి పోయిన పువ్వు అని గ్రహించి.. ఎంత స్పీడ్‌గా వచ్చారో అంతే స్పీడ్‌గా గోడ దూకి వెళ్లిపోయారు’
‘పోతే పోనివ్వు తమ్మీ. కమలంలో మొదటి నుంచి ఉన్నవాళ్లే ఉంటారు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. బాల్ రెడ్డి , నరేంద్ర , నేనూ …’
‘ఆగన్నా ఆగు … మీరు చెప్పిన వాళ్లు లేరు. వారి పేర్లు కూడా ఈ తరం ఓటర్లకు తెలియవు.’
‘తెలియకపోతేనేం తమ్మీ… బంగారం, వజ్రాల విలువ మనకు తెలియనంత మాత్రాన వాటికి విలువ ఉండదా?’
‘కానీ ప్రస్తుతం మనం గాజు ముక్కలను చూసి వజ్రాలు అని, కాకి బంగారాన్ని చూసి బంగారం అని భ్రమల్లో ఉన్నా మనిపిస్తుంది…’
‘నువ్వేం కంగారు పడకు. నీ డిపాజిట్ డబ్బులు నేనిస్తాను’
‘చూస్తుంటే… 119 మందికి డిపాజిట్ డబ్బులు మీరే ఇవ్వాల్సి వస్తుందేమో?’
‘119 ఎందుకు ఇస్తాం. అందులో 8 మందికి పవన్ ఇవ్వాలి…’
‘లెక్కలు బాగానే వేస్తున్నావన్నా… మన పరిస్థితి అంతేనా?’
‘మనం లాస్ట్ బాల్‌ను అలానే రహస్యంగా ఉంచాం. లాస్ట్ బాల్ వేశారంటే అందరూ క్లీన్ బౌల్డ్ కావలసిందే. అదే కిరణ్ కుమార్ రెడ్డిని చివరలో రంగంలో దింపుతాం.’
‘అవును. కిరణ్ కుమార్ రెడ్డి మన పువ్వు పార్టీలోనే ఉన్నాడు కదూ… మరిచే పోయాను’
‘పెద్ద పెద్ద అస్ర్తాలను చివరలో ప్రయోగిస్తారు. అందుకే కిరణ్‌ను ఇంకా యుద్ధ రంగంలోకి దించలేదు’
‘అన్న… హస్తం వాళ్ళు లాస్ట్ బాల్ అని పి.చిదంబరాన్ని తీసుకుని వచ్చారు. ఆయన తెలంగాణ కోసం అమరులు అయిన వందలాది మందిని ఇప్పుడు గుర్తు చేసుకున్నారు. వారికి క్షమాపణలు చెప్పారు. కాంగ్రెస్ వాళ్లేమో తెలంగాణ మేమే ఇచ్చాము, అంటుంటే ఈయన అమరవీరులను గుర్తు చేస్తే… తెలంగాణ వారికి వారిని బలి తీసుకున్న కాంగ్రెస్ మీద కోపం రాకుండా ఉంటుందా?’
‘నువ్వు ఎన్నయినా చెప్పు… కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ వేస్తారు. అంతా క్లీన్ బౌల్డ్ అవుతారు.’
‘అవును. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఇలానే లాస్ట్ బాల్‌తో క్లీన్ బౌల్డ్ చేస్తాను అన్నారు. తనను సీఎంను చేసిన కాంగ్రెస్‌ను, తనను నమ్మిన వారిని క్లీన్ బౌల్డ్ చేసి సెల్ఫ్ అవుట్ అయ్యారు. ఇప్పుడు కిరణ్‌తో పాటు మీ బృందం అంతా కూడా అలాగే కావడం ఖాయం.’
– మురళి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

