కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, పాలనా సౌలభ్యం కోసం 2016 అక్టోబర్ 11న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 33 జిల్లాలను ఏర్పాటు చేశారు.
జిల్లాలతోపాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసి దేశంలోనే రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపారు. నూతన జిల్లాలు ఆవిర్భవించి పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేసీఆర్‌కు కృతజ్ఞ్ఞతగా ఆదివారం జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ‘జిల్లాల దశాబ్ది వేడుక’ సంబురాలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. విద్యార్థులు, యువకులు, ప్రముఖులతో కలిసి 2కే రన్ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలతోపాటు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి గాల్లోకి గులాబీ బెలూన్లు ఎగురవేశారు. తెలంగాణ ఉద్యమంతోపాటు, జిల్లాల ఏర్పాటు కోసం ఉద్యమించిన పలు వృత్తి సంఘాల ప్రతినిధులు, జిల్లా ఉద్యమకారులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, కళాకారులను సన్మానించారు.

కేసీఆర్‌తోనే తెలంగాణకు గుర్తింపు
మాజీ సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణకు గుర్తింపు వచ్చిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా ఇచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతాభినందనలు తెలుపుతూ జిల్లాలో 2కే రన్ నిర్వహించారు. వాకింగ్ గ్రూపు సభ్యులకు, విద్యార్థులకు, యువకులకు నిరంజన్‌రెడ్డి స్వీట్లు పంపిణీ చేశారు.
-వనపర్తి (పెబ్బేరు)

దశాబ్ది సంబురాల వేదిక తొలగింపు
దశాబ్ది సంబురాల కోసం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు శనివారం రాత్రి వేదిక వేయించారు. సభకు అనుమతి లేదని రాత్రి 12 గంటల తరువాత పోలీసులు అడ్డుకుని తొలగించారు. ఈ ఘటనపై దివాకర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
– మంచిర్యాల టౌన్

దశాబ్దాల కలను నెరవేర్చిన కేసీఆర్
ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేసిన వారినే గుర్తుంచుకుంటారని, ఇబ్బందులు పెట్టేవారికి గుణపాఠం చెప్తారని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ బాల్క సుమన్ స్పష్టంచేశారు. మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
– మంచిర్యాల టౌన్

వికారాబాద్ ప్రజల కల సాకారం
వికారాబాద్ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను కేసీఆర్ నెరవేర్చారని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ అన్నారు. కలెక్టరేట్ ఎదుట కేసీఆర్ చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు.
– వికారాబాద్

జనగామ దశ, దిశ మార్చిన కేసీఆర్
కాదనుకున్న జిల్లాను కానుకగా ఇచ్చి కరువుగడ్డ దశ, దిశ మార్చిన గొప్ప దార్శనికుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు,తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు కృతజ్ఞ్ఞతగా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు.
– జనగామ (నమస్తే తెలంగాణ)

దూరదృష్టితోనే కొత్త జిల్లాలకు శ్రీకారం
కేసీఆర్ దూర దృష్టితో చిన్న జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్లలో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, తోట ఆగయ్య, తుల ఉమ, గూడూరి ప్రవీణ్‌తో కలిసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు.
-రాజన్న సిరిసిల్ల(నమస్తే తెలంగాణ)

కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల వద్దకు పాలన
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ప్రజల వద్దకు పాలన అంటూ గ్రామాలను, పట్టణాలు, జిల్లాలను అభివృద్ధి చేసేందుకు ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాడని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పల్లె రవికుమార్, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి 36 మంది ఉద్యమకారులను సన్మానించారు.
-భువనగిరి అర్బన్

5కే రన్.. అదిరెన్!
జిల్లాల ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన 5కే రన్ ఉత్సాహంగా సాగింది. పెద్దపల్లి బస్‌స్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించగా, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు సీ సత్యనారాయణరెడ్డితో కలిసి పార్టీ నియోజకవర్గ నాయకురాలు దాసరి ఉష జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు, పాల్గొన్న వారికి మెడల్స్‌ను ప్రదానం చేశారు.
– పెద్దపల్లి కమాన్

ఆదివాసీల కలను నిజం చేసిన కేసీఆర్
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆదివాసీల కలలను నిజం చేస్తూ ఏర్పాటు చేసిన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా.. దశాబ్ది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్

గద్వాల జిల్లా ఏర్పాటుతోనే అభివృద్ధి
కేసీఆర్ గద్వాలను జిల్లా చేయడం వల్లే ప్రస్తుతం అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ నాయకుడు బాసు హనుమంతునాయుడు అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
-గద్వాల

నాగర్‌కర్నూల్ జిల్లా ఆవిర్భవించి పదేండ్లు పూర్తయిన సందర్భంగా జిల్లాకేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు పటాకులు కాల్చి, సంబురాలు జరుపుకొన్నారు.
-నాగర్‌కర్నూల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

