తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలపై కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఏప్రిల్ 24వ తేదీన మొదలైన కేసీఆర్ బస్సు యాత్ర నిన్నటితో ముగిసింది. దాదాపు అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత సుడిగాలి పర్యటన చేశారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్‌లో కేసీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించారు.
KCR press meet live