బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యలపై చర్చిస్తున్నారు.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు మరియు విద్యార్థి సంఘం నేతలు హాజరయ్యారు.

Kcr1