జయంతి వేడుకల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను సీఎం కేసీఆర్ సాధిస్తున్నారని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. దళిత, బడుగు, బలహీనవర్గాల నాయకుడు పాపన్నగౌడ్ జయంతి సబ్బండవర్గాలకు పండుగరోజు అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర కల్లుగీత సంఘా ల సమన్వయ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో పాపన్నగౌడ్ 371 జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కల్లు గీత సంఘాల సమన్వయ సమితి నాయకులు బాలగోని బాలరాజుగౌడ్, యెలికట్టే విజయ్‌కుమార్‌గౌడ్, అయిలి వెంకన్నగౌడ్, గీత కార్మికుల సంఘం అధ్యక్షుడు రమణ, గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.