కేసీఆర్‌కు అన్నీ అనుకూలతలే
ప్రస్తుతం దేశంలో మూడో జాతీయ పార్టీకి చోటు ఉన్నదా? ఉంటే దానిని బీఆర్ఎస్ భర్తీ చేయగలదా? తెలంగాణ ముద్ర గల కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించగలరా? అంటూ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 140 కోట్ల జనాభా ఉన్న సువిశాల భారతదేశంలో ఉన్నది రెండే జాతీయ పార్టీలు. ఇందులో ఒకటి కనుమరుగయ్యే దుస్థితికి చేరిపోగా..
- తెలంగాణ ఉద్యమనాయకుడిగా దేశవ్యాప్తంగా చరిష్మా
- మేధావిగా, విజన్ ఉన్న నాయకుడిగా ప్రఖ్యాతి
- దేశవ్యాప్తంగా అన్ని వర్గాల సమస్యలపై అవగాహన
- దేశంలో మరే నాయకుడికి లేని రాజకీయ చతురత
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం దేశంలో మూడో జాతీయ పార్టీకి చోటు ఉన్నదా? ఉంటే దానిని బీఆర్ఎస్ భర్తీ చేయగలదా? తెలంగాణ ముద్ర గల కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించగలరా? అంటూ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 140 కోట్ల జనాభా ఉన్న సువిశాల భారతదేశంలో ఉన్నది రెండే జాతీయ పార్టీలు. ఇందులో ఒకటి కనుమరుగయ్యే దుస్థితికి చేరిపోగా.. మరో పార్టీ మతముద్ర వేసుకొని ఒకే వర్గానికి పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో మూడో జాతీయ పార్టీ కోసం దేశం ఎదురు చూస్తున్నదని మేధావులు అంటున్నారు. దేశంలో పరిస్థితులు మారాలన్నా, సమస్యలు తీరాలన్నా మరో జాతీయ పార్టీ అనివార్యమనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
చుక్కానిలా బీఆర్ఎస్
ప్రస్తుతం దేశం సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నది. నిరుద్యోగం, పేదరికం, అప్పులు, మత విద్వేషాలు వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది. అ పరిస్థితుల్లో దేశ ప్రజలకు కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ చుక్కానిలా కనిపిస్తున్నది. ఇది ఆషామాషీగా ఏర్పాటుచేసిన పార్టీ కాదు. ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఆర్థిక, రాజకీయ మేధావులతో చర్చలు, రైతు సంఘాల నేతలతో మేధోమథనం తర్వాత ఏర్పాటుచేశారు. అందుకే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ సంచలనంగా మారింది.
జాతీయ స్థాయిలో కేసీఆర్ ఖ్యాతి
కేసీఆర్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుందా? ఆయనపై ఉన్న తెలంగాణ ముద్ర వీడుతుందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ సీఎం కావొచ్చు.. కానీ ఆయన ఎప్పుడో జాతీయ నేతగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని రాష్ర్టాలు తిరిగి, అన్ని పార్టీలతో చర్చలు జరిపి వారందర్నీ ఏకం చేసిన చరిత్ర కేసీఆర్‌ది. కేంద్రంలో మంత్రిగానూ సేవలందించారు. దీనికి తోడు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల చాతుర్యం, అందర్నీ ఏకం చేసే రాజకీయ చతురత ఆయన సొంతం. ప్రస్తుతం దేశం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నది? వాటికి పరిష్కారం ఏమిటనేదానిపై స్పష్టత ఉన్న నేత కేసీఆర్. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు, ఆర్థికం ఇలా అన్ని అంశాల్లోనూ సమస్యలకు పరిష్కారాలు చూపారు. తెలంగాణ ముద్ర మరింత అనుకూలం. తెలంగాణ మాడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్లున్న నేపథ్యంలో ఆయనకది మరింత బలం పెంచుతుందే తప్ప… ఆటంకం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ప్రధాని మోదీ ఒకప్పుడు గుజరాత్ సీఎంగా పనిచేశారు. జాతీయస్థాయి ఆలోచనలున్న నేత ఎక్కడున్నా.. జాతీయ రాజకీయాలు పెద్ద ఇబ్బందేమీ కావని మేధావులు అంటున్నారు. వీటన్నింటికి తోడు హిందీ, ఇంగ్లిష్‌పై పట్టుండటం కేసీఆర్ జాతీయ నేతగా రాణించేందుకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

