కామారెడ్డి, జనవరి 26: రోడ్డు విస్తరణలో భాగంగా అధికారుల సూచన మేరకు తన ఇంటిని కూల్చేందుకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సిద్ధపడ్డారు.
ఇందులో భాగంగా శనివారం ఉదయం 9.30 గంటలకు అధికారుల సమక్షంలో స్వయంగా తన ఇంటిని కూల్చివేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు ఆయన ప్రకటించారు.