వైభవంగా రామయ్య పట్టాభిషేకం
మంగళవాద్యాలు మోగుతుండగా.. భక్తుల కరతాళ ధ్వనులు ప్రతిధ్వనిస్తుండగా.. వేద మంత్రోచ్ఛారణ నడుమ భద్రాద్రి రామయ్య పట్టాభిషిక్తుడయ్యాడు.
- భక్తుల జయజయధ్వానాల మధ్య వేడుక
ఖమ్మం, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంగళవాద్యాలు మోగుతుండగా.. భక్తుల కరతాళ ధ్వనులు ప్రతిధ్వనిస్తుండగా.. వేద మంత్రోచ్ఛారణ నడుమ భద్రాద్రి రామయ్య పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ అపూరూప ఘట్టానికి భద్రాచలంలోని మిథిలా స్టేడియం వేదికైంది. ఆదివారం కల్యాణ మహోత్సవం జరిగినచోటే సోమవారం కన్నుల పండువగా శ్రీరామచంద్రస్వామి పట్టాభిషేకం జరిగింది. తొలుత అర్చకులు పల్లకీలో ఉత్సవమూర్తిని స్టేడియానికి తీసుకొచ్చారు. యాగశాలలో అర్చకులు చతుఃస్థానార్చన, విశ్వక్సేన హోమం చేపట్టారు. పంచ నదుల తీర్థ జలాలతో సంప్రోక్షణ చేసి, ఆ తీర్థాన్ని అష్టదిక్కుల్లో చల్లారు. పట్టాభిషేక ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. రాముడి పాలన నేటి తరాలకు ఆదర్శం కావాలని చెప్పారు. స్వామివారికి బంగారు పాదుకలు, ఛత్రం, ముద్రిక, రాజదండం, కిరీట ధారణ గావించారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆలయ ఈవో బానోతు శివాజీ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్టు గవర్నర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

