మేనమామ మంచిమనసు.. కరోనాలోనూ కల్యాణలక్ష్మి

- 9 లక్షలమందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్
- కరోనాలోనూ 2.2లక్షల మందికి ఆడబిడ్డ కట్నం
- ఇప్పటిదాకా రూ.9వేల కోట్ల ఖర్చు
ఇంతకన్నా ఇంకేం కావాలి. పేదిండి ఆడబిడ్డ కోరుకునేది ఇదే కదా. పెండ్లి చేసి అత్తారింటికి పంపించే ఆర్థిక స్థోమత తల్లిదండ్రులకు లేనప్పుడు ఆమెపడే బాధ.. గుండెకు గుచ్చుకొనే ముల్లులాంటిది. కానీ, నేనున్నాంటూ మేనమామ అండగా నిలబడితే! కట్నం పోసి అత్తారింటికి పంపిస్తే! ఆ ఆడబిడ్డ కండ్లల్లో కనిపించే ఆనందం అనంతం. ఆ ఆనందాన్ని చూడాలనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి.. ఇప్పటిదాకా 9 లక్షల మందికి మేనమామయ్యారు. ఈ ఒక్క పథకానికే ఇప్పటిదాకా రూ.9 వేల కోట్లు ఖర్చుచేశారు. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కాస్త గాడితప్పినా ఆడబిడ్డ మనసు కష్టపెట్టొద్దని 2.2 లక్షల మందికి కట్నం ఇచ్చారు.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఒక నిర్ణయం కొందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఆ గొప్ప నిర్ణయమే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్. ఆడబిడ్డ సంతోషంగా ఉంటే పుట్టింటికి మంచి జరుగుతుందని నమ్మకం. అందుకే కట్నాలు, కానుకలు ఇచ్చి ఆడబిడ్డను బంగారంగా చూసుకుంటాం మన తెలంగాణలో. ఆ సంప్రదాయం ఒక ఇంటికో, ఒక ఊరికో పరిమితం కావొద్దని, ఆడబిడ్డల ఆనందంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చేపట్టిన ఈ పథకం.. గొప్ప మైలురాయిని చేరుకుంటున్నది. పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి దాదాపు 9 లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సహాయం అందింది. 2014-15 ఆర్థిక సంవత్సరం మధ్యలో తొలుత రూ.51 వేలతో ప్రారంభమైన పథక సహాయాన్ని రూ.75 వేలకు పెంచి ఆ తర్వాత రూ.1,00,116 కు చేశారు. ముందుగా ఎస్సీ, ఎస్టీ, పేదింటి ముస్లిం మైనార్టీల కోసం ప్రారంభించి 2016-17లో బీసీలకు వర్తింపజేస్తూ సీఎం కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 2017-18లో ఏ కులంలోని పేదలైనాసరే పథకాన్ని అగ్రవర్ణ పేదలకు కూడా పథక ఫలాన్ని అందించారు.
కరోనా కాటేసినా..
కరోనా ఆర్థిక రంగాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఆ ప్రభావం రాష్ట్రంపై బాగానే పడింది. అయినా, అభివృద్ధి, సంక్షేమంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని 2020-21లోనూ 2.2 లక్షల మందికి రూ.1,00,116 చొప్పున అందజేశారు. విశేషమేమిటంటే.. 2019-20 కంటే 2020-21లో దాదాపు 40 వేల మందికి అదనంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద చెక్కులు అందచేయటం.
లబ్ధిదారుల వివరాలు..
సంవత్సరం మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మొత్తం
2014-15 5414 5159 2472 – – 13405
2015-16 27446 30614 17736 – – 75796
2016-17 27383 25340 14715 35652 – 103090
2017-18 24927 25223 16326 61469 3722 131667
2018-19 34205 30600 16500 82575 8103 171983
2019-20 36325 34648 24190 71447 7928 174538
2020-21 29234 30854 17022 132383 13540 223033
మొత్తం 184934 182438 108961 383526 33293 893152
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

