Kaleshwaram Report | హైదరాబాద్ : శాసనసభలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు కాళేశ్వరం కమిషన్ నివేదికను పెన్ డ్రైవ్ల రూపంలో అందజేశారు. అయితే ఫ్లోర్ లీడర్లకు మాత్రమే 650 పేజీల ఫిజికల్ రిపోర్టును అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్షనేతగా సభకు రాలేదు కాబట్టి రిపోర్టు కాపీని ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.