హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో యథావిధిగా రైళ్లు పునరుద్ధరించబడ్డాయి. ఉదయం నుంచి యువతతో అట్టుడికిన రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. స్టేషన్‌లోని అన్ని ప్లాట్ ఫాంలలో పోలీసులు భారీగా మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగడంతో.. సికింద్రాబాద్‌లోని ఒకటో నంబర్ ప్లాట్ ఫాం నుంచి లింగంపల్లి – కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్ బయల్దేరింది.
మరికాసేపట్లో గరీభ్‌రథ్, దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా బయల్దేరనున్నట్లు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. అయితే రద్దు అయిన రైళ్లకు సంబంధించిన ప్రయాణికులకు టికెట్ డబ్బులను రిఫండ్ చేస్తామని గుప్తా స్పష్టం చేశారు. సికింద్రాబాద్ స్టేషన్లో ఉదయం 9:15 గంటలకు అన్ని రైళ్లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 10 గంటల తర్వాత రైళ్లు పునరుద్ధించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.