హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి ఒరిజినల్ మెమోలను(లాంగ్) స్కూళ్లకు పంపించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కే లింగయ్య తెలిపారు. శనివారం వీటిని బడులకు పంపిస్తామని, వార్షిక పరీక్షలు, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన సర్టిఫికెట్లను బడులకు చేరవేస్తామని తెలిపారు.
విద్యార్థులు పాఠశాల హెచ్ఎంలను సంప్రదించి మెమోలు పొందాలని సూచించారు.