‘కాళేశ్వరం’లో మీ పాత్ర ఏమిటి?
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సోమవారం పలువురు ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లను విచారించింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో మీ పాత్ర ఏమిటి?, అనుమతు లు, ఆర్థిక అంశాల్లో మీరు ఎలాంటి పాత్ర పోషించారు?’
- పలువురు ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లను ప్రశ్నించిన కమిషన్
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సోమవారం పలువురు ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లను విచారించింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో మీ పాత్ర ఏమిటి?, అనుమతు లు, ఆర్థిక అంశాల్లో మీరు ఎలాంటి పాత్ర పోషించారు?’ అని ప్రశ్నించినట్టు తెలిసిం ది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఐఏఎస్ అధికారులు రా హుల్ బొజ్జా, స్మితా సబర్వాల్, వికాస్ రా జ్, మాజీ ఐఏఎస్‌లు సోమేశ్ కుమార్, రజ త్‌కుమార్, ఎస్కే జోషి విచారణకు హాజర య్యారు.
వీరిలో ఎస్కే జోషి ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి అనేక కోణాల్లో వారిని ప్రశ్నించినట్టు సమాచారం. వివరణ ను అఫిడవిట్ రూపంలో వారం రోజుల్లోగా అందజేయాలని సూచించినట్టు తెలిసింది. బడ్జెట్ సమావేశాలు ఉండడంతో గడువు కావాలని రామకృష్ణారావు కోరగా, ఆగస్టు 5వరకు సమయం ఇచ్చినట్టు సమాచారం. విద్యుత్ శాఖ ఇంజినీర్ కే రఘు కూడా కమిషన్ ముందు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

