కొల్లాపూర్, అక్టోబర్ 27 : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీప బంధువు, కొల్లాపూర్‌కు చెందిన జూపల్లి కుమార్‌రావు బీఆర్ఎస్ గూటికి చేరారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ క్యాంప్ కార్యాలయంలో ఆయన గులాబీ పార్టీలో చేరగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత రంగినేని అభిలాష్‌రావు సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ.. మంచిచేసే పార్టీలోకి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వలస కడుతున్నారని చెప్పారు. అనంతరం కుమార్‌రావు మాట్లాడుతూ 19 ఏండ్ల జూపల్లి హయాంలో కొల్లాపూర్‌లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని విమర్శించారు. బీరం హయాంలో ప్రగతి పరుగులు పెట్టిందని, అందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు తెలిపారు.