Green India Architect | మాజీ ఎంపీ సంతోష్‌కు గ్రీన్ ఇండియా ఆర్కిటెక్ట్ పురస్కారం
Green India Architect | గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు గ్రీన్ ఇండియా ఆర్కిటెక్ట్ పురస్కారం దక్కింది. 19 కోట్లకు పైగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించేందుకు గొప్ప ప్రేరణగా నిలిచినందుకు ఈ అవార్డు దక్కింది.
Green India Architect | గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు గ్రీన్ ఇండియా ఆర్కిటెక్ట్ పురస్కారం దక్కింది. 19 కోట్లకు పైగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించేందుకు గొప్ప ప్రేరణగా నిలిచినందుకు ఈ అవార్డు దక్కింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కాంపాక్ట్ నెట్వర్క్ ఇండియా, ఇండస్ట్రియల్ అవుట్‌లుక్ మ్యాగజైన్, ఈపీఎస్ ఎనర్జీ ఎక్స్పో సంయుక్త ఆధ్వర్యంలో శనివారం (నవంబరు 29) పుణెలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. సంతోష్‌కుమార్ తరపున కరుణాకర్‌రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా అందజేసిన ప్రశంసాపత్రంలో…“హరా హై తో భరా హై”, “గ్రీన్ ఇండియా ఫర్ ఎ గ్రేట్ ఇండియా” వంటి నినాదాల స్ఫూర్తిని నిజం చేసేలా మాజీ ఎంపీ సంతోష్ చేసిన పర్యావరణ నిర్మాణాత్మక సేవలను, సంరక్షణ కార్యక్రమాలను కొనియాడారు. ఈ సందర్భంగా ఈపీఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ దేశవ్యాప్తంగా ఓ ప్రజా ఉద్యమంగా మారిందని ప్రశంసించారు. పర్యావరణ సంరక్షణ కోసం ప్రేరణగా నిలిచి పట్టణాల్లో అటవీ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడిందని పేర్కొన్నారు. ప్రజలందరినీ భాగస్వాములను చేయడం గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రత్యేకత అని కొనియాడారు. సంతోష్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా ‘మాస్ ప్లాంటేషన్ డ్రైవ్స్’, ‘వాక్ ఫర్ వాటర్’, ‘లివబుల్ ప్లానెట్’ వంటి పర్యావరణ, నీటి సంరక్షణ, సుస్థిరాభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఈపీఎస్ ప్రతినిధులు వివరించారు. స్వచ్ఛమైన హరిత సమాజం రూపుదిద్దుకునేలా గ్రీన్ ఇండియా చాలెంజ్ దోహదపడుతున్నదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

