హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనిర్సిటీలో టీచింగ్ అసోసియేట్స్/పార్ట్‌టైం టీచర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్టు రిజిస్ట్రార్ తెలిపారు. అగ్రోనామి-1, జెనిటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్-1, అగ్రికల్చర్ ఎకానమీ-1, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ-1, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్-1, హార్టికల్చర్-1, యానిమల్ ప్రొడక్షన్-1 ఖాళీలున్నట్టు పేర్కొన్నారు.
సంబంధిత విభాగంలో ఎంఎస్సీ(అగ్రికల్చర్), ఎం ఎస్సీ(హార్టికల్చర్), ఎంవీఎస్సీ, పీహెచ్డీ/నెట్ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. రెండేళ్ల టీచింగ్ అనుభవం, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు.
అగ్రోనమి, జెనిటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, అగ్రికల్చర్ ఎకానమీ విభాగాలకు సోమవారం, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్, హార్టికల్చర్, యానిమల్ ప్రొడక్షన్ విభాగాలకు మంగళవారం ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.