మలక్‌పేట, జనవరి 2: పారాలింపిక్స్ కాం స్య పతక విజేత జీవాంజి దీప్తి విశిష్ట క్రీడా పురస్కారమైన అర్జున అవార్డుకు ఎంపికవడం దివ్యాంగులందరికీ గర్వకారణమని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య కొనియాడారు. హైదరాబాద్‌లోని వికలాంగుల సహకార సంస్థ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పారాలింపిక్స్‌లో కాంస్యపతక విజేత జీవాంజి దీప్తి ఎంపికవడం విశేషమైని పేర్కొన్నారు.
ఆమె అర్జున అవార్డుకు ఎంపికైన సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సభ్యులతో కలిసి దీప్తి, కోచ్ నాగపురి రమేశ్ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశామని వివరించారు. ఈ సందర్భంగా దీప్తికి రూ.కోటి నగదు పురస్కారం, 500 గజాల ఇంటిస్థలం, గ్రూప్-2 ఉద్యోగం ఇస్తామని సీఎం ప్రకటించారని తెలిపారు. అందుకు దివ్యాంగుల తరఫున సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. క్రీడాకారులు దీప్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్, జనవరి 2 (నమస్తేతెలంగాణ) : ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షల పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను డైరెక్టర్ పీవీ శ్రీహరి గురువారం విడుదల చేశారు. ఈ నె ల 9 నుంచి 22 వరకు చెల్లించవచ్చ ని సూచించారు. రూ.25 అపరాధ రుసుముతో ఈ నెల 23 నుంచి 29 వరకు, రూ.50 అపరాధ రుసుము తో ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు చెల్లించవచ్చని వెల్లడించారు. తత్కాల్ కింద ఫిబ్రవరి 4 నుంచి 5 వరకు చెల్లించవచ్చని తెలిపారు.