జేఈఈ మెయిన్-1కు 7.86లక్షల దరఖాస్తులే!
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పరీక్ష అయిన జేఈఈ మెయిన్-1కు దరఖాస్తులు మందకొడిగా వస్తున్నాయి. గతంతో పోల్చితే ఆశించిన స్పందన కనిపించడంలేదు. ఇప్పటివరకు 7.86లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. నిరుడు సెషన్-1తో పోల్చితే దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 22తో ముగియనున్నది. ఆలస్య రుసుముతో ఈ నెల 26 వరకు దరఖాస్తు చేయవచ్చు.
- గడువు దగ్గర పడుతున్నా మందకొడిగా అప్లికేషన్లు
- 26తో ముగియనున్న గడువు.. జనవరి 20 నుంచి పరీక్షలు
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పరీక్ష అయిన జేఈఈ మెయిన్-1కు దరఖాస్తులు మందకొడిగా వస్తున్నాయి. గతంతో పోల్చితే ఆశించిన స్పందన కనిపించడంలేదు. ఇప్పటివరకు 7.86లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. నిరుడు సెషన్-1తో పోల్చితే దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 22తో ముగియనున్నది. ఆలస్య రుసుముతో ఈ నెల 26 వరకు దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తుల గడువు సమీపిస్తున్న కొద్ది దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నెల 10 వరకు కేవలం 5.72లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు.
రెండు రోజులు గడిచిన తర్వాత 12వ తేదీన 6.70లక్షల మంది దరఖాస్తు చేయగా, శనివారం వరకు 7.86లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. జేఈఈ సెషన్-1 పరీక్షలు 2027 జనవరి 20 నుంచి 28 వరకు జరుగనున్నాయి. ఈ నెల 26తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుంది. 27న దరఖాస్తుల్లో దొర్లిన తప్పుల సవరణకు అవకాశముంది. దరఖాస్తుదారులు త్వరపడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏటా అబ్బాయిలే అత్యధికంగా జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. నిరుడు సెషన్-2కు మొత్తం 11.10లక్షల మంది దరఖాస్తు చేసుకొంటే 10.34 లక్షల మంది పరీక్ష రాశారు. వీరిలో 7.08లక్షల మంది అబ్బాయిలుంటే.. అమ్మాయిలు కేవలం 3.26లక్షల మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

