వరద కాలువ ఉన్నా అందని సాగునీరు
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్లముందే ఎండిపోవడంతో అన్నదాత గుండె తరుక్కుపోతున్నది. పంట చేతికొస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని, బ్యాంకు రుణంలో కొంతైనా తీర్చవచ్చని ఆశించిన రైతుకు నిరాశే మిగిలింది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండకు చెందిన అట్ల అంజిరెడ్డి, అతడి భార్య అరుణ తమకున్న10 ఎకరాల్లో వరి సాగు చేశారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు.
- 10 ఎకరాలు వరి సాగు చేస్తే ఎండిన ఐదు ఎకరాలు
- అప్పు తీరుతదనుకుంటే మరింత అప్పుల్లోకి..
- జనగామ జిల్లా నమిలిగొండలో రైతు అంజిరెడ్డి ఆవేదన
స్టేషన్‌ఘన్‌పూర్, అక్టోబర్ 26 : ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్లముందే ఎండిపోవడంతో అన్నదాత గుండె తరుక్కుపోతున్నది. పంట చేతికొస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని, బ్యాంకు రుణంలో కొంతైనా తీర్చవచ్చని ఆశించిన రైతుకు నిరాశే మిగిలింది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండకు చెందిన అట్ల అంజిరెడ్డి, అతడి భార్య అరుణ తమకున్న10 ఎకరాల్లో వరి సాగు చేశారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు.
ఈ సారి బ్యాంకు లోన్ కొంతైన తీర్చాలనుకున్నారు. కానీ వర్షాలు లేకపోవడంతో పొలానికి రెండు గొలుసుల దూరంలోనే దేవాదుల వరద కాలువ ఉన్నా సరిపడా నీరు అందక ఐదు ఎకరాలు ఎండిపోయింది. మరో మూడు తడులు అందితే ఐదు ఎకరాల పంట చేతికొచ్చేది. కానీ, చేతికొచ్చిన పంట ఎండిపోవడంతో రోజూ పశువులను మేపుతున్నానని రైతు అంజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.
సర్కార్ నిర్లక్ష్యం వల్లే ..
దేవాదుల కాలువకు పక్కనే ఉన్నా సాగునీరు అందక పంట ఎండిపోయింది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి పంట పొలాలకు సాగునీరు అందించాలి. ఎండిపోయిన పంటలను పరిశీలించి పరిహారం చెల్లించాలి. – అంజిరెడ్డి, రైతు, నమిలిగొండ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

