Daughter murder | దండుమైలారంలో పరువు హత్య.. ప్రేమించినందుకు కూతురును కొట్టిచంపిన తల్లి
తాము వద్దన్న వాడినే ప్రేమించిందన్న కోపంతో తల్లిదండ్రులు కన్న కూతురుపై పరువు హత్యకు పాల్పడ్డారని ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఇబ్రహీంపట్నం రూరల్, మార్చి 19: తాము వద్దన్న వాడినే ప్రేమించిందన్న కోపంతో తల్లిదండ్రులు కన్న కూతురుపై పరువు హత్యకు పాల్పడ్డారని ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని దండుమైలారం గ్రామంలో కొన్ని రోజులుగా భార్గవి, అదే గ్రామానికి చెందిన శశి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో పలుమార్లు మందలించారు. అయినా.. యువతిలో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులు జంగమ్మ, ఐలయ్య తీవ్రమైన కోపంతో ఉన్నారు.
ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం శశి యువతి ఇంటికి వచ్చాడు. దీంతో జంగమ్మ కోపోద్రిక్తురాలై భార్గవిపై దాడిచేసింది. అంతేకాదు.. చీరతో ఇంట్లోనే ఉరేసి హతమార్చినట్టు స్థానికులు ఆరోపించారు. తన చెల్లి భార్గవిని తమ తల్లి జంగమ్మ హత్యచేసిందంటూ మృతురాలి సోదరుడు చరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు జంగమ్మపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ సత్యనారాయణ తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

