హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): ప్రతి గుడి ఆవరణలో జమ్మి చెట్టును నాటాలని చిలుకూరు బాలాజీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్, స్కంద సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ పండితులు కోరారు. గ్రీన్ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన ‘గుడి గుడికో ఓ జమ్మి చెట్టు’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సికింద్రాబాద్‌లోని స్కందగిరి సు బ్రహ్మణ్య స్వామి, చిలుకూరు బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో జమ్మి చెట్టును నాటారు. కార్యక్రమంలో పవన్‌కుమార్, బీఆర్ఎస్ మొయినాబాద్ మండల జనరల్ సెక్రటరీ నర్సింహాగౌడ్, యూత్ వైస్ ప్రెసిడెంట్ నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
విజయవాడకు ఈ-గరుడ బస్సులు ; సోమవారం నుంచి అందుబాటులోకి
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పటాన్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టీఎస్ శుభవార్త చెప్పింది. బీహెచ్ఈఎల్ డిపో నుంచి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ వెళ్లేందుకు రెండు ఈ-గరుడ బస్సులను సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ బస్సులు రామచంద్రాపురం, నిజాంపేట్ క్రాస్‌రోడ్స్, జేఎన్టీయూ రైతుబజార్, శిల్పారామం, సైబరాబాద్ కమిషనరేట్, టెలికంనగర్ మీదుగా ఓఆర్ఆర్ నుంచి విజయవాడ వెళ్తాయని తెలిపారు. ప్రతిరోజూ రాత్రి 9.30, 10.30 గంటలకు రామచంద్రాపురం నుంచి బయల్దేరుతాయన్నారు.