హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : సీబీఐ మాజీ అధికారి, జై భారత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ తనకు ప్రాణహాని ఉందంటూ విశాఖ సీపీకి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తనను చంపేందుకు గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ప్లాన్ చేశారని ఆరోపించారు. జేడీ లక్ష్మీనారాయణ విశాఖ నార్త్ నుంచి జైభారత్ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన కాలంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డిని, అక్రమ ఆస్తుల కేసులో జగన్‌ను, ఇతర కేసులో ఐఏఎస్ అధికారులను జైలుకు పంపిన అధికారుల్లో లక్ష్మీనారాయణ ఒకరు.