ఆదివారం 23 ఫిబ్రవరి 2020
జాగిలాల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

జాగిలాల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

Feb 15, 2020 , 02:16:20
PRINT
జాగిలాల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌
  • విధుల్లోకి 37 జాగిలాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఐఐటీఏ) ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 37 జాగిలాలకు శుక్రవారం మొయినాబాద్‌లోని జాగిలాల శిక్షణాకేంద్రం లో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌ చంద్‌ మాట్లాడుతూ.. 16 ఏండ్ల క్రితం ప్రారంభించిన ఐఐటీఏలో ఇప్పటివరకు 885 జాగిలాలకు తర్ఫీదునిచ్చినట్టు తెలిపారు. పలు ముఖ్యమైన కేసులను ఛేదించడంలో పోలీసుజాగిలాలు కీలకపాత్ర పోషించాయన్నారు. 


పేలుడు పదార్థాల గుర్తింపు, ప్రమాదకర ప్రాంతాలకు చేరుకోవడం, వీఐపీ ల భద్రత వంటి అత్యంత కీలకమైన అంశాల్లో జాగిలాలు సహకరిస్తున్నాయని సెక్యూరిటీ విభాగం ఐజీ ఎంకే సింగ్‌ పేర్కొన్నారు. ఐఐటీఏలో ఇతర రాష్ర్టాల శునకాలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. బిహార్‌కు చెందిన 20 శునకాలకు ఇటీవలే అక్రమమద్యం గుర్తించేందుకు ప్రత్యేకశిక్షణ ఇచ్చామని చెప్పారు. పరేడ్‌ హాజరైన పలువురు అధికారులు జాగిలాలు నుంచి గౌరవ వందనం స్వీకరించారు.  ఈ సందర్భంగా జాగిలాల ప్రదర్శనలు, సాహకకృత్యా లు ఆకట్టుకున్నాయి. ఉత్తమశిక్షణ పొందిన జాగిలాలు, వాటిశిక్షకులకు ప్రశంసాప్రతాలు, మెడల్స్‌ అందజేశారు. కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్‌ ఐజీ సీవీ ఆనంద్‌, శిక్షణా సంస్థ ప్రిన్సిపాల్‌ తాజొద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo