హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : భారతదేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడా ఉత్సవాల్లో ఒకటైన ‘ఈషా గ్రామోత్సవం-26’ 18వ ఎడిషన్‌కు సర్వం సిద్ధమైంది. ‘ఈషా అవుట్ రీచ్ యాక్షన్ ఫర్ రూరల్ రీజువెనేషన్’ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ ఉత్సవం ద్వారా గ్రామీణ భారతస్ఫూర్తిని, ఆరోగ్యాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యం. ఖేలో ఇండియా గుర్తింపు పొందిన ఈ క్రీడా వేదికపై 10 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 40వేల గ్రామాలకు చెందిన సుమారు 80వేల మందికిపైగా గ్రామీణ క్రీడాకారులు తలపడనున్నారు. ఈ టోర్నమెంట్లో 7వేలకు పైగా జట్లు పాల్గొంటుండగా, అందులో 15 వేల మంది మహిళలు ఉండటం విశేషం. వివిధ దశల్లో విజేతలుగా నిలిచే జట్లకు మొత్తం రూ.కోటి నగదు బహుమతులు అందజేస్తారు. ఫైనల్లో గెలిచిన జట్లకు రూ.5 లక్షల వరకు నగదు పురసారం ఇవ్వనున్నారు. క్రీడల్లో పాల్గొనేవారు ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. జట్టులోని ఆటగాళ్లంతా తప్పనిసరిగా ఒకే గ్రామానికి చెందినవారై ఉండాలి.
తెలంగాణలో పోటీల షెడ్యూల్..