హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): (సెరికల్చర్)లో నియామకాలు చేపట్టకపోవడం, నిధులు కేటాయించకపోవడంతో ఆశాఖ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆశాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు. గురువారం బీఆర్కే భవన్‌లోని రైతు కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భవానీరెడ్డి, గోపాల్‌రెడ్డి, గడుగు గంగాధర్‌తో వారు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రైతు కమిషన్‌కు సెరికల్చర్ విభాగంలో అధికారుల కొరత తీవ్రంగా ఉన్నదని వివరించారు. రాష్ట్రంలో పట్టుపురుగుల సాగులో మంచి లాభాలున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా సెరికల్చర్ డిపార్ట్మెంట్లో కేవలం 60మందే ఉన్నారని తెలిపారు.