ములుగు : మేడారం సమక్క(Sammakka) – సారలమ్మ మహా జాతర (Medaram Maha Jatara) కీలక ఘట్టానికి చేరింది. తల్లుల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఎటు చూసిన జనంతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపో యాయి. కాగా, మేడారంలో భక్తుల దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతున్నది.
మేడారం మహా జాతర సందర్భంగా గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సర్వ దర్శనానికి (Darshanam) మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతున్నది. అలాగే వీఐపీ, వీవీఐపీ, దర్శనానికి సైతం గంట నుంచి రెండు గంటల సమయం పడుతున్నది. భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి ఒపికగా క్యూలైన్లో నిలబడి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.