హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్ హాల్‌టికెట్లను సోమవారం కాకతీయ వర్సిటీ అధికారులు విడుదల చేశారు.
ఈ నెల 26, 27న ఐసెట్‌ను మొత్తం నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. జూన్ 20న ఐసెట్ ఫలితాలు విడుదలకానున్నాయి.