హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఆదాయ మార్గాలను పెం చుకునేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవడంపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ దృష్టి సారించింది. అందులో భాగంగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ బుధవారం జలసౌధలో ఈఎన్సీలు, ఇతర ఉన్నతాధికారులతో పలు అంశాలపై సమాలోచనలు జరిపారు.
రాష్ట్ర ప్రభు త్వం అందుబాటులోకి తెచ్చిన రిజర్వాయర్ల ప్రాంతాల్లో టూరిజం, ఫిషరీస్ అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలని తెలిపారు. రాష్ట్రంలోని 40 వేల కిలోమీటర్ల కెనాల్ నెట్వర్క్ ఉన్నదని, ఆ ప్రాంతాలతోపాటు రిజర్వాయర్లపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టాలని నిర్దేశించారు. ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలోని భవనా లు, ఖాళీ స్థలాలను సైతం సద్వినియో గం చేసుకొని ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేసి, నివేదిక అందజేయాలని ఆదేశించారు.