Transfers | లెక్కించని సీనియారిటీ.. ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు!
రాష్ట్రంలోని ఆర్థిక శాఖ డైరెక్టర్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో జరిగిన ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు జరిగాయని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ విభాగంలో నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీలు జరిగాయని అనుమానిస్తున్నారు. దాంతో తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు.
- నిబంధనలకు వ్యతిరేకంగా ట్రాన్స్ఫర్లు
- అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
- బదిలీ ప్రక్రియ పునఃపరిశీలించాలి
- ప్రభుత్వానికి ఆర్థిక శాఖ డైరెక్టర్ వర్క్స్ అకౌంట్స్ బాధిత ఉద్యోగుల వినతి
Transfers | హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆర్థిక శాఖ డైరెక్టర్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో జరిగిన ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు జరిగాయని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ విభాగంలో నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీలు జరిగాయని అనుమానిస్తున్నారు. దాంతో తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ఒక ప్రదేశంలో నాలుగేండ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న ప్రతి ఉద్యోగిని బదిలీ చేయాలి. కానీ, డైరెక్టర్ వర్స్ అకౌంట్స్ కార్యాలయంలోని డివిజనల్ అకౌంట్స్ అధికారుల(డీఏవో) బదిలీల్లో సీనియారిటీని సక్రమంగా లెకించలేదని చర్చించుకుంటున్నారు.
కొందరు ఉద్యోగులు ఒకే స్టేషన్లో 6-7 ఏండ్ల సర్వీసు పూర్తిచేసుకున్నా వారి వివరాలు పూర్తిగా సేకరించలేదని ఆరోపిస్తున్నారు. బదిలీ నిబంధన 40% పరిధిలోకి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఒక ప్రదేశంలో తకువ కాలం పనిచేసినా, తప్పనిసరి బదిలీల్లోకి వచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, సీనియర్ ఉద్యోగులకు పూర్తి వేకెన్సీ చూపకుండా, తకువ కాలం పనిచేసిన జూనియర్ ఉద్యోగులకు ముందే కొన్ని వేకెన్సీలను రిజర్వ్ చేసి.. తమకు బదిలీ ఆర్డర్స్ ఇచ్చారని పేర్కొంటున్నారు.
ఉదాహరణ 1: హనుమకొండలోని మిషన్ భగీరథ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక డీఏవో 6 ఏండ్లకుపైగా ఒకే స్టేషన్లో పనిచేసినా బదిలీ జాబితాలోకి తీసుకోలేదు.
ఉదాహరణ2: పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ములుగు కార్యాలయంలో ఉన్న క్లియర్ వేకెన్సీని వరింగ్ స్టేషన్ సర్వీస్ ప్రకారం సీనియర్ ఉద్యోగులకు చూపించకుండా మిషన్ భగీరథ వరంగల్ కార్యాలయంలో తకువ సర్వీస్‌తో పనిచేస్తున్న మరొక డీఏవోకు కేటాయించినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

