హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్‌ను తెలంగాణకు తిరిగి పంపిస్తూ కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ సంజీవ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్నేండ్లుగా ఇండో టిబెటన్ బార్డర్ ఆఫ్ పోలీస్ (ఐటీబీపీ) ఐజీగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అకున్ సబర్వాల్‌ను ప్రీ మ్యాచ్యూర్ రిపాట్రియేషన్ ద్వారా తెలంగాణకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అంతకుముందు ఇక్కడ కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన 2023లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోకి డిప్యూటేషన్‌పై వెళ్లారు. గతంలో తెలుగు సినీనటుల డ్రగ్స్ వ్యవహారం అకున్ సబర్వాల్ ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్నప్పుడే వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలం రాష్ట్ర పౌర సరఫరాలశాఖ కమిషనర్‌గా పనిచేశారు. అకున్ సబర్వాల్ సతీమణి స్మితాసబర్వాల్ ప్రస్తుతం ఆర్థికసంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నారు.