పోచమ్మమైదాన్, మార్చి 13 : ఆజంజాహి మిల్లు కార్మిక భవనం కూల్చివేతపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో గురువారం విచారణ ప్రారంభమైంది. నాయకులు, కార్మికులు కలిసి ఆనాటి కార్మిక భవనానికి సంబంధించిన ఆధారాలను వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్‌కు అందజేశారు.
విచారణలో భాగంగా వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో కార్మిక భవనం పరిరక్షణ సమితి నాయకులు, దళిత కార్మికులు తహసీల్దార్‌కు కార్మిక భవనానికి సంబంధించిన అన్ని ఆధారాలను సమర్పించారు. అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ.. 75 సంవత్సరాల పాటు కార్మికుల సమావేశాలు, సభలకు వేదికైన ఆజంజాహి కార్మిక భవనాన్ని తప్పుడు పత్రాలతో కబ్జాచేసి కూల్చారని తెలిపారు. భవనాన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.