అంతర్జాతీయ ‘సిమ్’దొంగల ఆటకట్టు
ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ర్టాల్లో సిమ్‌కార్డులను సేకరించి దుబాయ్, థాయిలాండ్, కంబోడియా, చైనా వంటి దేశాలకు చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్న ముగ్గురు అంతర్జాతీయ దొంగలను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
- ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
- 113 సిమ్‌కార్డులు, 3మొబైళ్లు సీజ్
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ర్టాల్లో సిమ్‌కార్డులను సేకరించి దుబాయ్, థాయిలాండ్, కంబోడియా, చైనా వంటి దేశాలకు చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్న ముగ్గురు అంతర్జాతీయ దొంగలను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 113 సిమ్‌కార్డులు, 3 మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన షేక్ సుభానీ, జీడిమెట్లకు చెందిన కే నవీన్, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌కు చెందిన ఎం ప్రేమ్‌కుమార్ అలియాస్ మైఖేల్… వివిధ పేర్లతో సేకరించిన సిమ్‌కార్డులు సేకరిస్తారు. ఈ సిమ్‌కార్డులను దుబాయ్‌లోని విజయ్ ద్వారా దుబాయ్, థాయిలాండ్, కంబోడియా, చైనా తదితర దేశాల్లోని సైబర్ నేరస్థులకు రూ 1,500 నుంచి 3,000కు విక్రయిస్తున్నారు. దేశీయ నెంబర్లు కావడంతో ఆ నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను వినియోగదారులు వారి పూర్తి సమాచారాన్ని సైబర్‌నేరగాళ్లకు వెల్లడించటం సులువు అవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సైబర్ క్రైం విభాగం అత్యంత చాకచక్యంగా కట్టడి చేయగలిగింది. ప్రధాన నిందితుడు విజయ్ను అరెస్టు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసు అధికారుల బృందాన్ని సైబర్ క్రైం డైరెక్టర్ శిఖాగోయల్ అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

