Inter Student | రాష్ట్రంలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. పరీక్షల భయంతో బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువముందే మరో విద్యార్థిని కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకేసింది. హనుమకొండ జిల్లా బీమారంలో శనివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
మృతురాలిని శాయంపేట మండలం గట్లకానిపర్తి వాసి సాహిత్యగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.