Student Suicide | మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని టెకం శ్రీ వర్ధన్‌గా గుర్తించారు. శ్రీ వర్ధన్ పట్టణంలోని నక్షత్ర బాయ్స్ హాస్టల్లో గురువారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక మిమ్స్ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శ్రీ వర్ధన్ స్వస్థలం ఆసిఫాబాద్ జిల్లా తుమ్రిగూడ గ్రామం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.