Inter Exam Fee | హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కోర్సులకు సంబంధించి, వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థుల నుంచి ఫీజు స్వీకరించాలని ఆయా కాలేజీలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు విద్యార్థులు ఫీజు చెల్లించొచ్చు. నవంబర్ 16 నుంచి 23వ తేదీ వరకు రూ. 100 ఆలస్య రుసుంతో, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు రూ. 500 ఆలస్య రుసుంతో, డిసెంబర్ 6 నుంచి 13 వరకు రూ. 1000 ఆలస్య రుసుంతో, డిసెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు రూ. 2 వేల ఆలస్య రుసుంతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
ఫస్టియర్ రెగ్యులర్ విద్యార్థులు రూ. 510, ఒకేషనల్ రెగ్యులర్ విద్యార్థులు రూ. 730, సెకండియర్ ఆర్ట్స్ విద్యార్థులు రూ. 510, సైన్స్, ఒకేషనల్ విద్యార్థులు రూ. 730 చొప్పున ఫీజు చెల్లించాలని బోర్డు పేర్కొంది.