ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఫస్టియర్‌లో 63%, సెకండియర్‌లో 46% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అమ్మాయిలు ఫస్టియర్‌లో 79,801 (68.62%), సెకండియర్‌లో 25,910 (51%) పాసయ్యారు.
- ఫస్టియర్‌లో 63 %, సెకండియర్‌లో 46% పాస్
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఫస్టియర్‌లో 63%, సెకండియర్‌లో 46% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అమ్మాయిలు ఫస్టియర్‌లో 79,801 (68.62%), సెకండియర్‌లో 25,910 (51%) పాసయ్యారు. అబ్బాయిలు ఫస్టియర్‌లో 77,940 (57.40శాతం), సెకండియర్‌లో 33,759 (43శాతం) ఉత్తీర్ణత సాధించారు.
2022లో ఫస్టియర్‌లో 68శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే, ఈ ఏడాది 63 శాతానికి తగ్గింది. సెకండియర్‌లో నిరుడు 48% ఉత్తీర్ణత సాధిస్తే, ఈసారి 46 శాతానికి పడిపోయింది. విద్యార్థులు కలర్ మెమోలను శనివారం నుంచి ఇంటర్‌బోర్డు వెబ్సైట్ నుంచి పొందవచ్చు. ఈ నెల 12 వరకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ దరఖాస్తుకు అవకాశం ఉన్నది.
మార్చి, తాజా ఫలితాలు కలుపుకుంటే ఫస్టియర్ జనరల్ కోర్సుల్లో 3,17,802 (73.38శాతం), వొకేషనల్‌లో 35, 863 (72.31శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
మార్చి, తాజా ఫలితాలు కలుపుకుంటే సెకండియర్ జనరల్ కోర్సుల్లో 3,25, 208(77.57శాతం), వొకేషనల్‌లో 36, 749 (79.52శాతం) విద్యార్థులు పాసయ్యారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

