పాలమూరులో దళితుడికి అవమానం
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో దళితుడికి తీరని అవమానం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. స్థానిక మోతీనగర్‌లో దళితుడు ఎత్తపోల్ల వెంకట్రాములు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
- ఆలయంలోకి వెళ్లొద్దని అడ్డగింత
- డయల్ 100కు ఫోన్ చేసినా స్పందన కరువు
మహబూబ్‌నగర్, జూలై 6 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో దళితుడికి తీరని అవమానం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. స్థానిక మోతీనగర్‌లో దళితుడు ఎత్తపోల్ల వెంకట్రాములు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
శుక్రవారం సాయంత్రం అదే ప్రాంతంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లగా.. అదే కాలనీకి చెందిన బోయ శివ, శశికుమార్, మూర్తి అడ్డుకున్నారు. ‘కులం తక్కువ వాడివి.. గుడిలోకి ఎందుకు వస్తావ్’ అంటూ దబాయించడంతోపాటు నెట్టేశారు. పరుష పదజాలంతో దుర్భాషలాడారు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదని బాధితుడు వాపోయాడు.
అదే రాత్రి 9:30 గంటలకు తాను ఇంట్లో లేని సమయంలో వచ్చి కుటుంబ సభ్యులను బెదిరించారని ఆయన ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ ఘటనపై శనివారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

