అధికారులకు ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచనలు
జగిత్యాల/జగిత్యాల రూరల్, డిసెంబర్ 4: సీఎం కేసీఆర్ ఈ నెల 7న జగిత్యాల పర్యటనను పురస్కరించుకొని మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ తో కలిసి వారు మోతె గ్రామంలో సభాస్థలాన్ని సందర్శించి బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు. వాహనాలు వచ్చే మార్గాలు, పారింగ్ ప్రదేశాలను గుర్తించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.