హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): తాళపత్ర గ్రంథాలు భ ద్ర పరచడానికి అధునాతన సాంకేతి క పరిజ్ఞానంతో నిర్మించనున్న భవన నిర్మాణ స్థలాన్ని బుధవారం అధికారులు పరిశీలించారు. జేఈవో సదా భార్గవి ఆధ్వర్యంలో అధికారుల బృం దం వేద విశ్వవిద్యాలయంలో స్థలా న్ని సందర్శించారు. పరిశోధన భవ నం వెనుక ఉన్న స్థలం భవన నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని నిర్ణయించారు.
పురావస్తుశాఖ, ఎస్వీ యూనివర్సిటీ వద్ద ఉన్న పురాతన తాళపత్ర గ్రంథాలను డిజిటైజ్ చేసి భావితరాలకు అందుబాటులో ఉం చాలని టీటీడీ మ్యాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్టేట్ విభాగం ఓఎస్డీ మల్లిఖార్జున, వర్సిటీ రిజిస్ట్రార్ రాధేశ్యాంతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.