హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటర్ల నమోదును ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) కలిసి ‘ఎలక్షన్ క్రి-థాన్ 2023 చాలెంజ్’ పేరుతో వినూత్న పోటీని ప్రారంభిచాయి. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ మంగళవారం విడుదల చేశారు. పోటీలో పాల్గొనేవారు ఓటర్ల నమోదును ప్రోత్సహించేందుకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ లేదా ఉర్దూలో నిమిషంలోపు నిడివి కలిగిన షార్ట్ వీడియోను లేదా 5 ఎంబీలోపు పోస్టర్‌ను ఈ నెల 16లోగా htts://tinyurl.com/electioncrea-thon2023లో సమర్పించాలి. విజేతలకు రూ.20 వేల నగదు బహుమతి ఉంటుందని తెలిపారు.