Infant Dies | ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. పురిటిలోనే పసికందు మృతి
Infant Dies | ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. ఓ పసికందు ప్రాణాన్ని బలిగింది. జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కకు బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు.
Infant Dies | ములుగు : ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. ఓ పసికందు ప్రాణాన్ని బలిగింది. జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కకు బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు.
ములుగు జిల్లాకు చెందిన విల్లా రవళికి నెలలు నిండడంతో.. ప్రసవం కోసం నిన్న ఉదయం ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పిన డాక్టర్లు.. సాయంత్రం వరకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. గర్భిణీ పరిస్థితి బాగా లేకపోవడంతో ఆపరేషన్ అన్న చేయండి.. లేకపోతే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తామని వైద్యులకు కుటుంబ సభ్యులు తెలిపారు.
నార్మల్ డెలివరీ కోసం వేచి చూసిన డెలివరీ కాకపోవడంతో బలవంతంగా నార్మల్ డెలివరీకి వైద్యులు ప్రయత్నించారు. వైద్యులు బలవంతంగా నార్మల్ డెలివరీకి ప్రయత్నించడంతో పురిటిలోనే బిడ్డ చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాబు చనిపోయాడని గర్భిణీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. చనిపోయిన తమ బిడ్డని చేతిలో పెట్టి ఏం చేసుకుంటారో, చేసుకోండి అంటూ వైద్యులు బెదిరిస్తున్నారు బాధితులు వాపోయారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని, తమకు న్యాయం జరిగే వరకూ ఆస్పత్రి నుంచి కదిలేదిలేదని కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

