హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : ఇప్పటికే ఖైదీల సామాజిక పరివర్తనకు కృషి చేస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకా రం చుట్టింది. ‘ఖైదీ నుంచి ఆత్మగౌరవం వైపు పరివర్తన’ నాలుగో దశను 74వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ప్రకటించింది.
‘నయా దిశా- స్మైల్ ఫర్ జువైనల్’ పేరిట ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ, ముం బై, చెన్నైలోని జువెనైల్ కరెక్షన్ సెంటర్లలో శుక్రవారం ప్రారంభించినట్టు ఐవోసీఎల్ చైర్మన్ ఎస్ ఎం వైద్య తెలిపారు.