ఖాట్మండు, ఏప్రిల్ 18: పర్వతారోహణకు వెళ్లి కనిపించకుండాపోయిన ఇద్దరు భారతీయులు సురక్షింగా ఉన్నట్టు తెలిసింది. నేపాల్లోని మౌంట్ అన్నపూర్ణ వద్ద కనిపించకుండా పోయిన భారత పర్వతారోహకులు బల్జీత్ కౌర్, అర్జున్ వాజ్పేయీలను కాపాడినట్టు యాత్రా నిర్వాహకులు మంగళవారం వెల్లడించారు. అదనపు ఆక్సిజన్ వినియోగించకుండా ప్రపంచంలోనే 10వ ఎత్తైన పర్వతం మౌంట్ అన్నపూర్ణను అధిరోహించిన 27 ఏండ్ల కౌర్.. సోమవారం శిఖర స్థానం నుంచి దిగుతుండగా క్యాంప్-4 వద్ద కనిపించకుండా పోయారు. ఏరియల్ సెర్చ్ బృందం 7,363 మీటర్ల ఎత్తు వద్ద ఆమెను గుర్తించి కాపాడారు. ముందుగా అమె మరణించి ఉంటుందని భావించారు. మరోవైపు అర్జున్ను 6,800 మీటర్ల ఎత్తులో కాపాడినట్టు నిర్వాహకులు తెలిపారు.