హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : హైకోర్టు తీర్పు మేరకు 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్లకు ఇంక్రిమెంట్లు, సర్వీస్ రెగ్యులైజేషన్ పూర్తిచేయాలని అధ్యాపక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇదే గడువులోపు లెక్చరర్ల ప్రొబేషనరీ డిక్లరేషన్ను పూర్తిచేయాలని సంఘాల నాయకులు కనకచంద్రం, వీ శ్రీనివాస్, కే సురేశ్ కోరారు.
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : మూడు, ఐదేండ్ల లా కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే లాసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను పొడిగించినట్టు ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ నెల 28లోగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చని, 28 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 1న వెబ్ ఆప్షన్లు ఎడిటింగ్ చేసుకోవచ్చని, 5న సీట్లు కేటాయిస్తామన్నారు.