హైకోర్టులో జడ్జీల సంఖ్య పెంచడం హర్షణీయం : వినోద్ కుమార్
బోయినపల్లి వినోద్ కుమార్ | రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర హైకోర్టులో వివిధ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండటం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న 24 మంది జడ్జీలతో ఈ కేసుల పరిష్కారం సమస్యగా మారిందని, ఈ నేపథ్యంలో హైకోర్టులో జడ్జీల సంఖ్యను 42 కు పెంచడం వల్ల కేసులు సత్వర పరిష్కారానికి దోహదం చేస్తుందని వినోద్ కుమార్ తెలిపారు.
రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 15 ఫిబ్రవరి 2019 లో ప్రధాని, కేంద్ర న్యాయశాఖ మంత్రి, సీజేఐ లకు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అంతకు ముందు కేంద్రానికి లేఖ రాశారని వినోద్ కుమార్ వివరించారు.
హైకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకతపై తాను 2019 జనవరిలో పార్లమెంటులో ప్రత్యేకంగా ప్రస్తావించానని వినోద్ కుమార్ తెలిపారు.
ఈ విషయంపై కేంద్ర పెద్దలతో పలుమార్లు చర్చించినట్లు ఆయన వివరించారు. ఎట్టకేలకు రెండేళ్ల తరువాత అయినా సరే తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకోవడం పట్ల వినోద్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచిన సీజేఐ ఎన్వీ రమణకు వినోద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
చిన్నారి గుండెకు అండగా ఎమ్మెల్యే మర్రి
ప్రజా సేవలో పోలీసులు అంకితం కావాలి
మెడికల్ హబ్‌గా మహబూబాబాద్ : మంత్రి సత్యవతి
వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలి
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి పువ్వాడ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

